రెండు నెలల క్రితం సికింద్రాబాద్-నాగ్‌పూర్ మధ్య వందే భారత్ ట్రైన్ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ట్రైన్‌లో ఆక్యుపెన్సీ తక్కువగా ఉందని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు గుర్తించారు. ప్రయాణికులు లేక ఆ ట్రైన్ 80 శాతం ఖాళీ సీట్లతో జర్నీ సాగిస్తున్నట్లు గుర్తించారు. ఈ నేపత్యంలో ట్రైన్ కోచ్‌లు తగ్గించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.