సికింద్రాబాద్-నాగ్‌పూర్ మధ్య నడుస్తోన్న వందే భారత్ ట్రైన్‌లో ఆక్యుపెన్సీ తక్కువగా ఉందని రైల్వేశాఖ గుర్తించింది. ప్రయాణికులు లేక ఆ ట్రైన్ వెలవెలబోతోందని అధికారులు తెలిపారు. దాదాపు 80 శాతం సీట్లు ఖాళీగానే ఉంటున్నట్లు గుర్తించారు. దీంతో ప్రస్తుతం 20 కోచ్‌లతో ట్రైన్ ఉండగా.. కోచ్‌లను తగ్గించేందుకు రైల్వే అధికారులు ఫ్లాన్ చేస్తున్నారు.