Srikakulam Man Get First Ayyappa Gold Locket: శబరిమల ఆలయంలో అయ్యప్ప స్వామి ప్రతిమతో కూడిన బంగారు లాకెట్ల విక్రయాలను ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ప్రారంభించింది. కేరళ దేవాదాయశాఖ మంత్రి వీఎన్ వాసవన్ విషు పర్వదినాన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలి లాకెట్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మణిరత్నంకు అందజేశారు. 2, 4, 8 గ్రాముల బరువులో ఈ లాకెట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని sabarimalaonline.org వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు.