సిక్సులతో చేలరేగిన మంత్రి అజారుద్దీన్.. హైటెన్షన్ మ్యాచ్‌లో సూపర్ విక్టరీ

3 weeks ago 3
హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో 'తెలంగాణ లెజిస్లేటర్స్‌ స్పోర్ట్స్‌ అండ్ కల్చరల్‌ మీట్‌-2026' రెండో రోజు ఆదివారం అత్యంత కోలాహలంగా సాగింది. ఈ వేడుకల్లో భారత మాజీ క్రికెట్ కెప్టెన్, ప్రస్తుత మంత్రి మహమ్మద్‌ అజారుద్దీన్‌ తన పాత రోజులను గుర్తు చేస్తూ బ్యాట్‌ పట్టారు. ఉత్కంఠభరితంగా సాగిన క్రికెట్ మ్యాచ్‌లో అజారుద్దీన్ వరుసగా రెండు సిక్సర్లు, ఫోర్లు బాది మూసీ రివర్‌ జట్టును గెలిపించారు. ఇక స్పోర్ట్స్ మీట్‌లో భాగంగా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వివిధ క్రీడల్లో పాల్గొని క్రీడాస్ఫూర్తిని చాటారు.
Read Entire Article