సిద్దిపేట వేదికగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు కౌంటర్ ఇచ్చారు. దమ్ముంటే సిద్దిపేటలో తనపై పోటీ చేయాలని.. అక్కడే తేల్చుకుందామని సవాల్ విసిరారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభోత్సవ సభలో పథకం గురించి మాట్లాడకుండా కేసీఆర్, కేటీఆర్, తన పేర్లను ప్రస్తావించేందుకే రేవంత్ ఎక్కువ సమయం కేటాయించారని విమర్శించారు. ప్రాజెక్టులకు అన్యాయం చేసింది ఎవరో తేల్చేందుకు అసెంబ్లీ నిర్వహించాలని.. తమ మైక్ కట్ చేయకుండా సభ నడిపించాలని డిమాండ్ చేశారు.