సినిమా టిక్కెట్లు కూడా అమ్మించారు.. కలెక్టర్ల సదస్సులో పవన్ కీలక వ్యాఖ్యలు

1 month ago 6
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి కలెక్టర్ల సదస్సును నిర్వహిస్తున్నారు. వెలగపూడిలోని సచివాలయంలో సీఎంచంద్రబాబు అధ్యక్షతన బుధవారం కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. భవిష్యత్‌ లక్ష్యాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తున్న సీఎం.. 6 నెలల పాలనలో చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి అంశాలపై సమీక్షించారు. శాంతి భద్రతలపైనా డీజీపీ, ఎస్పీలతో ఆరా తీస్తున్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్‌-2047 విజన్‌ డాక్యుమెంట్‌ ప్రజంటేషన్‌ను సీఎం ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేసిన పనులన్నీ వ్యవస్థల మూలాలను కదిలించే వరకు వెళ్లాయని అన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదని, నాయకత్వం వహించే నేతలు బాధ్యతాయుతంగా ఉండాలన్నారు. ప్రజలు మా నుంచి చాలా ఆశిస్తున్నారని, తాము ఎన్ని విధానాలు తీసుకొచ్చినా క్షేత్రస్థాయిలో వాటికి చేరువ చేయడంలో అధికారులదే కీలక పాత్ర అన్నారు. గత ప్రభుత్వం ఐఏఎస్‌లను కూడా ఎన్నో ఇబ్బందులకు గురిచేసిందని తెలిపారు.
Read Entire Article