సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో బెనిఫిట్ షోల రద్దు, టికెట్ల ధరల పెంపు ఉండదన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతో సినీ ఇండస్ట్రీ పెద్దలు నేడు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎంతో భేటీ అయ్యారు. అదే సమయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ బయట కామన్ మ్యాన్ పేరుతో ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. 'సినిమా పెద్దలు కాదు గద్దలు' అని రాసి ఉన్న ఫ్లెక్సీని ప్రదర్శించిన ఓ వ్యక్తి సినిమా షోలపై టికెట్ల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఒక సామాన్య ప్రేక్షుకుడిగా తన ఆవేదన సీఎంతో చెప్పుకోవాలని ఆందోళన చేపట్టినట్లుగా అతడు తెలిపారు.