తెలుగు భాష కనుమరుగు కాకముందే ఆ భాషను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పాలన, అధికార వ్యవహారాలు తెలుగులో జరగాలన్నారు. హైదరాబాద్‌లో జరగుతున్న తెలుగు మహాసభల్లో పాల్గొన్న ఆయన.. సినిమాల పేర్లు తెలుగులో ఉంటే బాగుంటుందని చెప్పారు.