సినిమాల్లో ‘పెళ్లి ఆపండి’ అనే డైలాగ్.. నిజ జీవితంలో కూడా వినిపించింది.. ఇంతకు ఏమైందంటే..

4 months ago 6
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలంలో మైనర్ బాలిక వివాహాన్ని ఐసీడీఎస్, చైల్డ్ వెల్ఫేర్ అధికారులు అడ్డుకున్నారు. 14 ఏళ్ల బాలిక గౌతమికి, ఇనుకొండ సురేష్తో పెళ్లి జరగడానికి గంట ముందు, రహస్యంగా అందిన సమాచారం ఆధారంగా అధికారులు రంగంలోకి దిగారు. వారు ఫంక్షన్ హాల్‌కు తాళం వేసి.. వధువు వరుడి కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. బాల్య వివాహాల అనర్థాలను వివరించి.. బాలికకు 18 ఏళ్లు నిండాకే పెళ్లి చేస్తామని అంగీకార పత్రం తీసుకుని వివాహాన్ని రద్దు చేశారు.
Read Entire Article