సినీ నటుడు పోసాని కృష్ణ మురళి నరసరావుపేట కోర్టులో ఊరట దక్కింది. నరసరావుపేట కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. రెండు పూచీకత్తులపై పోసానికి బెయిల్ మంజూరు చేసింది. టీడీపీ నేత కిరణ్ ఫిర్యాదు మేరకు గతేడాది నవంబర్‌లో నరసరావుపేట టూటౌన్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా నరసరావుపేట కోర్టులో ఆయనను హాజరుపరచగా.. కోర్టు పోసానికి బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు పోసానిని కస్టడీ ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను కర్నూలు కోర్టు కొట్టివేసింది.