ఆర్టీసీ బస్సు పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. గంబీరావు పేట మండలం.. గోరంటాల బ్రిడ్జి సమీపంలో ప్రమాదవశాత్తు పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలవురు ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.