తాజాగా విడుదలైన సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో తెలంగాణ అభ్యర్థులు మెరిశారు. తెలంగాణ నుంచి ఏకంగా 20 మంది అభ్యర్థులు సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటారు. ఈ సందర్భంగా తెలంగాణ నుంచి సివిల్స్‌కు ఎంపికైన అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఇక సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు తెలంగాణ సర్కార్ ఆర్థికంగా సాయం చేస్తున్న సంగతి తెలిసిందే.