కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పద్మ అవార్డులపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి పెదవి విరిచారు. తెలంగాణ నుంచి గద్దర్, గోరేటి వెంకన్న, అందె శ్రీ వంటి వారి పేర్లు సిఫార్సు చేస్తే.. కేంద్రం బుట్టదాఖలు చేసిందన్నారు. పక్కరాష్ట్రానికి ఐదు అవార్డులు ఇచ్చారని.. వారికంటే తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన వారు ఎందులో తక్కువని ప్రశ్నించారు. అలాగే గద్దర్ గురించి కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన రేవంత్ రెడ్డి.. మరోసారి గద్దర్‌ను కించపరిచేలా మాట్లాడితే.. వారి పార్టీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి గద్దర్ పేరు పెడతామని వార్నింగ్ ఇచ్చారు.