ఆపరేషన్ చేసి మహిళ శరీరంలో సర్జికల్ బ్లేడ్ వదిలేసిన డాక్టర్ మీద వేటు పడింది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఆ డాక్టర్‌ను వైద్యారోగ్య శాఖ అధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఘటన పల్నాడు జిల్లా నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగింది. రమాదేవి అనే మహిళకు ట్యూబెక్టమీ ఆపరేషన్ చేసిన డాక్టర్ నారాయణస్వామి.. ఆమె శరీరంలో సర్జికల్ బ్లేడ్ వదిలేశారు. మహిళకు నొప్పి రావటంతో వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఈ వ్యవహారం వెలుగుచూసింది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో డాక్టర్‌ను సస్పెండ్ చేస్తూ వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.