రాజధాని అమరావతి నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. నాలుగు నగరాలను కలుపుతూ మెగా సిటీ నిర్మాణం చేపట్టాలని భావిస్తోంది. గుంటూరు, విజయవాడ, మంగళగిరి, అమరావతిలను అనుసంధానం చేసి మెగా సిటీగా అభివృద్ధి చేయాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. ఆర్థిక అభివృద్ధికి రియల్ ఎస్టేట్ కీలకమనే భావనలో ప్రభుత్వం ఉంది. దీంతో ఈ నాలుగు నగరాలను కలిపి మెగా సిటీ ఏర్పాటు చేస్తే గుంటూరు ఎడ్యుకేషనల్ హబ్‌గా, విజయవాడ బిజినెస్ క్యాపిటల్‌గా, మంగళగిరి లాజిస్టిక్ హబ్‌గా అభివృద్ధి చెందనున్నాయి.