సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్బంగా.. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఛార్జిషీట్‌ను హరీష్ రావు విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు.. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డికి దుర్భాషా దురంధరుడు అనే బిరుదు ఇవ్వొద్దని.. రాజకీయ పరిభాషను దిగజార్చటంలో ఆయనది మేజర్ కాంట్రిబ్యూషన్ అని హరీష్ రావు చెప్పుకొచ్చారు.