సీఎం రేవంత్ రెడ్డి పేరును మరో నటుడు మర్చిపోయాడు. ఇటీవలే ఆయన పేరు మర్చిపోవటం పెద్ద రచ్చ అదేనండి చర్చ జరిగిన విషయం తెలిసిందే. అయితే.. అది కేవలం సినిమా ఫంక్షన్. కానీ ఇది ప్రతిష్ఠాత్మక కార్యక్రమం. అందులోనూ ఆయన నేరుగా ముందుగానే ఉన్నారు. అయినా సరే.. పేరు మర్చిపోవటమే కాదు మార్చేసి పలకటం గమనార్హం. దీంతో.. ఇది కచ్చితంగా ఘోర అవమానమేనని.. జైలుకు వెళ్లటం ఖాయమంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.