ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ చేశారు. SLBC టన్నెల్ ప్రమాద ఘటనపై ఆరా తీశారు. సీఎంను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కేంద్రం తరపున అన్ని విధాలా సాయం చేస్తామని భరోసా ఇచ్చారు. కాగా ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకున్నాయి. టన్నెల్‌లో 8 మంది చిక్కుకోగా.. వారిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ చెపట్టారు.