కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న సొంత పార్టీ నేతలపై ఏఐసీసీ, టీపీసీసీ కఠిన చర్యలకు సిద్ధమైంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిలపై మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత చేసిన కామెంట్లను అదిష్ఠానం సీరియస్‌గా తీసుకుంది. ఈ మేరకు ఆ వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలంటూ కొండా సురేఖకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొంది.