HYDRA Demolitions: హైదరాబాద్‌లో హైడ్రా బుల్డోజర్లు టాప్ గేర్‌లో దూసుకుపోతున్నాయి. నగరం నలువైపులా ఉన్న చెరువులు, కుంటలతో పాటు ప్రభుత్వ స్థలాలను అడ్డగోలుగా ఆక్రమించి నిర్మించిన కట్టడాలను నిర్దాక్షిణ్యంగా నేలమట్టం చేస్తున్నాయి. ఈ క్రమంలో.. దుర్గం చెరువు పరిసర ప్రాంతాల్లోని నిర్మాణాలకు కూడా హైడ్రా నోటీసులు జారీ చేయగా.. అక్కడి స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో.. హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేయటంతోపాటు.. అక్కడి కూల్చివేతలపై స్టే విధించింది.