విజయవాడ - మచిలీపట్నం జాతీయ రహదారి 65 విస్తరణ వ్యవహారం ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు చేరింది. ఈ మార్గంలోని నాలుగు వరుసల రహదారిని ఆరు వరుసలుగా విస్తరించేందుకు ప్రణాళికలు రచించారు. అందులో భాగంగా కన్సల్టెన్సీ సంస్థ డీపీఆర్ కూడా సిద్ధం చేసింది. ఈ డీపీఆర్ గురించి ఇటీవల నిర్వహించిన స్టేక్ హోల్డర్స్ సమావేశంలోనూ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. డీపీఆర్‌లో అండర్ పాస్‌లు, ఫ్లైఓవర్ల ప్రస్తావన లేదని జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా ఈ వ్యవహారంపై జాతీయ రహదారుల సంస్థ అధికారులు.. ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి్ కృష్ణబాబుతో సమావేశమయ్యారు. దీని గురించి వివరించారు.