మాజీ ముఖ్యమంత్రి జగన్ కు ఏం భద్రత తగ్గిందని వైసీపీ నేతలు గవర్నర్ ను కలిశారని ప్రశ్నించారు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్ కు ఎలాంటి భద్రత తగ్గించలేదని.. ముఖ్యమంత్రి గా పనిచేసిన వాడికి ఎన్నికల కోడ్ ఉల్లంఘించకూడదనే విషయం తెలీదా అన్నారు.ముఖ్యమంత్రిగా వ్యవస్థల్ని నాశనం చేసి ఎప్పుడూ లేనంత అధ్వాన్నంగా పరిపాలన చేశారని.. చంద్రబాబు ఇంటి గేటుకు తాళ్లు కట్టిన రోజులు, ఎమ్మెల్యే ని దాడికి పంపిన రోజులు గుర్తుకు రాలేదా? అంటూ ప్రశ్నించారు. రూ.7వేల ఎమ్ఎస్పీ ఫిక్స్ చేసిన జగన్ కు మిర్చి రైతుల వద్దకు వెళ్ళే అర్హత ఎక్కడుందని.ప్రజలు 11సీట్లు ఇచ్చి సంవత్సరమైనా జగన్ బుద్ధి మారలేదని మండిపడ్డారు. జగన్ ఇప్పటికైనా బుద్ధిమార్చుకోవాలని.. ఇంకా అసత్యాలతో ప్రజల్ని తప్పుదోవపట్టించాలనుకోవటం తగదన్నారు.