సీఐడీ అధికారి విజయ్ పాల్ అరెస్ట్.. రఘురామ రియాక్షన్ ఇదే

1 month ago 4
డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు (Raghuramakrishnamraju)ను గతంలో వైఎస్సార్‌సీపీ హయాంలో అక్రమంగా అరెస్టు చేయడమే కాదు.. థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో అప్పుటి సీఐడి ఏఎస్పీ విజయపాల్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రఘురామ ఫిర్యాదు ఆధారంగా ఈ కేసులో ఆయనను పోలీసులు అరెస్ట్ చేయగా.. ప్రస్తుతం కోర్టు రిమాండ్ విధించింది. తాజాగా, ఈ అరెస్ట్‌పై రఘురామ స్పందించారు. సీఐడీ రిటైర్డ్ ఏఎస్పీ విజయ్ పాల్ ఎన్నో దందాలు చేశారని ఆరోపించారు. ఆయన పాపం పండిందని, తెలియదు అని క్రిమినల్ లాగా సమాధానాలు చెప్తున్నారు అని తెలిసిందన్నారు. తనను కస్టోడియల్ టార్చర్ చేశారని తెలిపారు. అసలు కుట్ర చేసింది పీవీ సునీల్ కుమార్ అని ఆయన అన్నారు. ఏది ఏమైనప్పటికీ నిందితులను అరెస్ట్ చేయడం సంతోషంగా ఉందని తెలిపారు.
Read Entire Article