హిందీ టెలివిజన్ లో అత్యంత ప్రజాదరణ పొందిన షో సిఐడి. తెలుగుతో పాటు దేశంలో అన్ని భాషల్లోనూ సీఐడీ ఎపిసోడ్స్ ను డెబ్ చేశారు.. వీటికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. నేటికీ సీఐడీలను ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. ఒక యదార్థ కథ ఆధారంగా తెరకెక్కిన క్రైమ్ సిరీస్ సీఐడీ. ఇది చాలా సంవత్సరాలు బుల్లితెరపై కొనసాగింది. సీఐడీ షో కొన్నేళ్ల క్రితం ముగిసింది. సీఐడీలోని పాత్రలన్నీ హిట్టయ్యాయి. ఏసీపీ ప్రద్యుమన్ నుంచి దయా వరకు నటీనటులంతా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. అయితే ఈ షో పూర్తయ్యాక ఈ నటులు పెద్దగా కనిపించడం లేదు.. ప్రస్తుతం సీఐడీలో ఉన్న ఈ సూపర్ స్టార్స్ ఏం చేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.