ప్రొద్దుటూరు వన్‍టౌన్ సీఐ శ్రీరామ్ బదిలీ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. లిక్కర్ షాపుల నిర్వహణ, అసాంఘిక శక్తుల నియంత్రణ వంటి విషయాల్లో సీఐ పనితీరుపై స్థానికంగా మంచి అభిప్రాయం ఉంది. దీనికి తోడు ప్రొద్దుటూరు మాజీ శాసనసభ్యులు, వైసీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సైతం సీఐ పనితీరును మెచ్చుకున్నారు. ఇంత తక్కువ కాలంలో.. చాలా మంచి పేరు తెచ్చుకున్నారంటూ కొనియాడారు. అయితే ప్రొద్దుటూరు వన్‌టౌన్ సీఐగా పోస్టింగ్ వచ్చిన 40 రోజుల్లోనే ఆయనను బదిలీ చేయడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది.