సీజనల్‌ వ్యాధుల విజృంభణ.. హైదరాబాద్‌లో పెరుగుతున్న ఫ్లూ కేసులు

1 hour ago 1
సెప్టెంబర్‌లో సాధారణంగా తగ్గాల్సిన వైరల్‌ ఫీవర్‌, ఫ్లూ తరహా అనారోగ్యాలు ఈసారి హైదరాబాద్‌ నగరంలో పెరుగుతున్నాయి. ఫీవర్‌ ఆస్పత్రిలో రోజువారీ ఓపీ 400 నుంచి 600కు చేరగా.. నిలోఫర్‌లో రోజుకు సుమారు 100 మంది చిన్నారులు ఫ్లూ లక్షణాలతో వస్తున్నారు. వైరల్‌ ఫీవర్‌తో పాటు డెంగీ, టైఫాయిడ్‌ అనుమానిత కేసులు కూడా కనిపిస్తున్నాయి. దీర్ఘకాలిక వర్షాలు దోమల పెరుగుదలకు, వైరస్‌ల వ్యాప్తికి అనుకూలంగా మారాయని వైద్యులు చెబుతున్నారు. జ్వరం 72 గంటలకు మించి ఉంటే సెల్ఫ్ ట్రీట్మెంట్‌కు దూరంగా ఉండి వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
Read Entire Article