బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి బావమరిది లీగల్ నోటీసులు జారీ చేశారు. అమృత్ పథకం టెండర్లలో భారీగా అవినీతి జరిగిందని.. కేటీఆర్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఏకంగా రూ.8888 కోట్ల కుంభకోణం జరిగిందని.. అందులో టెండర్లను తమ బావమరిదికి సీఎం రేవంత్ రెడ్డి కట్టబెట్టారంటూ ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో.. కేటీఆర్‌కు సృజన్ రెడ్డి లీగల్ నోటీసులు జారీ చేశారు. తనపై చేసిన తప్పుడు వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని సూచించారు.