తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు ప్రమోషన్లు ఇచ్చింది. అదనపు డీజీలుగా ఉన్న వారికి డీజీలుగా పదోన్నతులు కల్పించింది. ఇందులో సజ్జనార్, మహేష్ భగవత్, స్వాతి లక్రా, వీవీ శ్రీనివాసరావు, చారు సిన్హా, అనిల్ కుమార్ ఉన్నారు. అయితే ఈ ఆరుగురు ఐపీఎస్ అధికారులకు ప్రమోషన్లు కల్పించినా.. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వారంతా అదే స్థానాల్లో కొనసాగనున్నారు.