ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు తెలంగాణ తెలుగు తేజం సాహిత్య పురస్కారం-2026 లభించనుంది. తెలుగు భాషా సంరక్షణ సంఘం-తెలంగాణ సాహితీ సంస్థ ఏటా అందజేస్తున్న బుర్ర నర్సమ్మ-లింగారెడ్డి స్మారక రాష్ట్ర స్థాయి పురస్కారానికి ఈసారి ఆయన ఎంపికయ్యారు. ఈ నెల 22న కరీంనగర్‌లో జరిగే కార్యక్రమంలో సుద్దాల అశోక్ తేజకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. తెలుగు భాషకు తెలంగాణ మట్టిబిడ్డలు అందించిన సేవలను గుర్తించడమే ఈ పురస్కారం ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.