తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. 2 వారాల తర్వాత ఈ కేసులో విచారణ జరుపుతామని తేల్చి చెప్పింది. ఇక ఈ కేసును అవినీతి కేసులా కాకుండా ఎన్నికల ఉల్లంఘన కేసుగా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొనగా.. తన పేరును తొలగించాలని బీఆర్ఎస్ నేత సండ్ర వెంకటవీరయ్య పిటిషన్లు దాఖలు చేశారు.