ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఓటుకు నోటు కేసు ఎంత సంచలనమైందో తెలిసిందే. ఈ కేసులో ప్రస్తుత తెలంగాణ సీఎం, అప్పటి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత రెడ్డి నిందితులుగా ఉన్నారు. పదేళ్లుగా ఈ కేసు విచారణ సాగుతూ ఉంది. అయితే, రేవంత్ సీఎంగా ఉండటంతో కేసును ప్రభావితం చేస్తారని, అందుకే వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఇతర బీఆర్ఎస్ నేతలు. సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.