మాజీ మంత్రి ఆర్కే రోజాపై కర్నూలు పోలీసులకు ఫిర్యాదు అందింది. రోజా చర్యల కారణంగా తమ మనోభావాలు దెబ్బతిన్నాయని, దళితులను ఆమె అవమానించారంటూ కర్నూలు త్రీటౌన్ పోలీసులకు దళిత సంఘాలు ఫిర్యాదు చేశాయి. పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో రోజా.. బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్‌ను సందర్శించాయి. అయితే ఈ సమయంలో ఓ ఉద్యోగి ఆమె చెప్పులను మోయటం అప్పట్లో వివాదాస్పదమైంది. ప్రతిపక్షాలు కూడా దీనిపై విమర్శలు గుప్పించాయి. సూర్యలంక బీచ్ ఘటన నేపథ్యంలో దళితులను రోజా అవమానించారంటూ దళిత సంఘాలు ఫిర్యాదు చేశాయి.