రెండు రోజుల కిందట సూర్యాపేటలో వెలుగుచూసి యువకుడి హత్య కేసులో దిమ్మదిరిగే నిజాలు వెలుగుచూస్తాయి. దీనిని పరువు హత్యగా నిర్దారించిన పోలీసులు.. యువతి కుటుంబసభ్యులే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు దాదాపు అంచనాకు వచ్చారు. స్నేహం పేరుతో తన ఇంటికి వచ్చిన కృష్ణ.. తన సోదరిని ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో యువతి అన్న నవీన్ కోపం పెంచుకొని హత్య చేసినట్లు తెలిసింది. మరో స్నేహితుడి ద్వారా కృష్ణను ట్రాప్ చేసి.. చంపేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.