మెల్‌బోర్న్ టెస్టులో సెంచరీతో సత్తాచాటిన తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటుగా పలువురు మంత్రులు నితీష్ కుమార్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు. ఇదే క్రమంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) సైతం నితీష్ కుమార్ రెడ్డికి నగదు ప్రోత్సాహకం ప్రకటించింది. ఏసీఏ తరుఫున నితీష్ కుమార్ రెడ్డికి రూ.25 లక్షల నగదు బహుమతి ప్రకటించింది. త్వరలోనే సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నితీష్ కుమార్ రెడ్డికి ఈ ప్రోత్సాహకం అందించనున్నారు.