రేపు సంగారెడ్డి జిల్లాలో అతి భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో అక్కడి ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు జిల్లా కలెక్టర్ సెలవును ప్రకటించారు. ఇదిలా ఉండగా.. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ ఐటీ ఉద్యోగులకు రేపు(ఆగస్టు 14) వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం సదుపాయం కల్పించాలని ఐటీ కంపెనీలను సైబరాబాద్ పోలీసులు కోరారు.