భార్యలను అతి కిరాతకంగా చంపుతున్న భర్తల కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లను సైతం పొట్టనపెట్టుకుంటున్నారు. క్షణికావేశంలో కాదు.. పక్కా ప్లాన్‌తో కట్టుకున్నవాళ్లను చంపేస్తున్నారు కొందరు మృగాళ్లు. ఇటీవల ఇలాంటి కేసులు ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో మహిళలపై దాడులు, హత్య ఘటనలు జరగడానికి కారణాలేంటి? చట్టాలు కఠినంగా ఉన్నా.. భర్తలు ఇలా ఎందుకు తెగిస్తున్నారు? మగవాళ్ల ప్రవర్తనలో ఈ మార్పులకు కారణాలేంటి? అనే విషయాలపై ఇప్పుడు చర్చిద్దాం..