సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కోసం ఖైత్లాపూర్‌లో రూ. 200 కోట్లతో ఐకానిక్ ప్రధాన కార్యాలయాన్ని నిర్మించనున్నారు. జీ+10 అంతస్తులతో నిర్మించే ఈ భవనంలో కమాండ్ కంట్రోల్ సెంటర్, కౌన్సిల్ హాల్ ఉండనున్నాయి. అదేవిధంగా మల్కాజిగిరి కార్పొరేషన్ కోసం ఉప్పల్ భగాయత్‌లో రూ. 98 కోట్లతో శాశ్వత భవన నిర్మాణానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ రెండు ప్రాజెక్టులు నగర పరిపాలనా వ్యవస్థను మరింత బలోపేతం చేయనున్నాయని ఆయా కార్పొరేషన్ అధికాలు చెబుతున్నారు.