అంబులెన్స్ సైరన్ వినిపిస్తే చాలు.. మనసులో దైవాన్ని తలచుకుని ప్రాణాపాయ స్థితిలో ఉన్నది ఎవరైనా కాపాడు స్వామి అని ఒక్క క్షణం వేడుకుంటాం. అలాంటి అంబులెన్స్ సైరన్‌ను కొంత మంది వెదవలు దుర్వినియోగం చేస్తున్నారు. అలాంటి ఘటనే హైదరాబాద్ పంజాగుట్టలో చోటుచేసుకుంది. సైరన్ వేసుకుని.. వేగంగా రోడ్డుపై దూసుకెళ్తున్న ఓ అంబులెన్స్ మీద పోలీసులకు అనుమానం వచ్చి ఆపి చెక్ చేశాడు. అందులో ఉన్న సీన్ చూసి.. అందుకు ఆ డ్రైవర్ చెప్పిన ఆన్సర్ విని నివ్వెర పోవటం పోలీసుల వంతైంది.