వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సొంత ఇలాఖాలోనే షాక్ తగలనుందా.. ఇప్పటి వరకూ కంచుకోటగా ఉన్న స్థానంలోనే జగన్‌కు టీడీపీ షాక్ ఇవ్వనుందా.. అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. కడప కార్పొరేషన్‌లోని ఏడుగురు వైసీపీ కార్పొరేటర్లు పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు సమాచారం. వీరంతా సోమవరం సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరతారనే వార్తలు వస్తున్నాయి. కడప ఎంప వైఎస్ అవినాష్ రెడ్డి వైసీపీ కార్పొరేటర్లతో నిర్వహించిన సమావేశానికి సైతం వీరంతా డుమ్మా కొట్టడం అనుమానాలకు తావిస్తోంది.