Ap Minister Nara Lokesh Praises School Students Honest: ఏపీ మంత్రి లోకేష్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినిల నిజాయితీపై ప్రశంసలు కురిపించారు. తిరుపతి జిల్లా వెంకటగిరి గర్ల్స్ హైస్కూల్‌కు చెందిన విద్యార్థినిలకు ఒక పర్సు దొరికింది.. ఓపెన్ చేసి చూస్తే బంగారం, డబ్బులు ఉన్నాయి. వెంటనే ఆ పర్సును తీసుకెళ్లి పోలీసులకు అప్పగించి నిజాయితీని చాటుకున్నారు. ఆ తర్వాత పర్సును పోగొట్టుకున్న బాధితురాలికి అప్పగించారు. నిజాయితీగా వ్యవహరించిన విద్యార్థినిలను లోకేష్ ప్రశంసించారు.