తెలుగు రాష్ట్రాల్లో కొత్త తరహా సైబర్ నేరాలు వెలుగు చూస్తున్నాయి. ఆడపిల్లలను కిడ్నాప్ చేశారంటూ కేటుగాళ్లు తల్లిదండ్రులకు వాట్సాప్ కాల్స్ చేసి డబ్బులు లాగుతున్నారు. ఇటువంటి కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని TGSRTC ఎండీ సజ్జనార్ హెచ్చరించారు. అజ్ఞాత వ్యక్తుల కాల్స్‌కు స్పందించవద్దని.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెబుతున్నారు.