తెలంగాణలోని అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి ఒకే విధమైన కామన్ మెనూను అమలు చేయాలని తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. అన్ని కేటగిరీల వారికి మెస్ ఛార్జీలను పెంచాలని, ఒకే మెస్ ఛార్జీలను అమలు చేయాలని సీఎస్‌కు నివేదిక ఇచ్చింది.