ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నకిలీ సీఐ హల్‌చల్ చేశారు. శివయ్య అనే వ్యక్తి సీఐగా పనిచేస్తున్నానంటూ హడావిడి చేశారు. తాను ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ సీఐ అంటూ స్టేషన్‌లోనే హంగామా చేశాడు. మనోడి తీరుపై పోలీసులకు అనుమానం కలిగింది. మెల్లిగా ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. నకిలీ సీఐ బాగోతం వెలుగుచూసింది. ఇంకా లోతుగా ఆరాతీస్తే మనోడి మీద అన్నమయ్య జిల్లా కే.వి.పల్లి పోలీస్ స్టేషన్‌లో శివయ్య అలియాస్ శివకుమార్ మీద కేసు కూడా ఉన్నట్లు సమాచారం. సీఐగా చెప్పుకుంటూ సెటిల్‌మెంట్లు, బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.