చంద్రబాబు సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. సూపర్ సిక్స్‌లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు ఇప్పటికే ఏపీలో స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈ పథకానికి రూ.400 కోట్ల నిధులను మంజూరు చేశారు. ఈ పథకం ప్రారంభం నుంచి.. ఇప్పటివరకు అయిన ఖర్చులకు సంబంధించి ఆర్టీసీకి నిధులను విడుదల చేశారు. దీనిపై ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.