అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ శ్రీ శ్రీ గురు విశ్వ స్ఫూర్తి వారి దివ్య ఆశీస్సులతో విజయవాడలోని కే. ఎల్. రావు భవన్‌లో స్ఫూర్తి కుటుంబం ట్రస్ట్ స్త్రీ శక్తి సోషల్ స్ఫూర్తి విభాగం వేడుకలనుశనివారం ఘనంగా నిర్వహించింది. శక్తి అంటే కుటుంబాన్ని చక్కదిద్దుకుంటూనే సమాజం కోసం, మానవత్వం కోసం పాటుపడేది అని పూర్ణ గురుదేవులు వివరించారు. ఆర్ధిక వ్యవహారాలు, సంస్కృతి పరిరక్షణలో స్త్రీది కీలక పాత్ర అని గురుదేవులు అంటారు.