సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం ఉదయం ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల అమలు, మేయర్ పదవికి ప్రత్యక్ష ఎన్నికలు వంటి కీలక ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే విశాఖపట్నం, కర్నూలులో వివిధ ప్రాజెక్టులపైనా కీలక నిర్ణయాలు తీసుకున్నారు.