తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ మెంబర్, సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్‌కు తెలంగాణ హైకోర్టులు భారీ ఊరట దక్కింది. వివాదాస్పదంగా మారిన ట్రైనీ ఐఏఎస్ పూజ ఖేద్కర్ వ్యవహారంపై స్పందిస్తూ.. దివ్యాంగుల రిజర్వేషన్ల గురించి స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు. అయితే.. స్మితా సబర్వాల్ మీద దాఖలైన పిటిషన్లను పరిశీలించిన ధర్మాసనం.. వాటికి విచారణ అర్హత లేదంటూ.. కొట్టేసింది. దీంతో.. స్మితా సబర్వాల్‌కు భారీ ఊరట లభించినట్టయింది.