హైదరాబాద్‌లోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తోంది. ఆక్రమణలకు పాల్పడింది ఎంతటివారైనా.. ఉపేక్షించకుండా బుల్డోజర్లు పంపుతున్నారు. ఈ నేపథ్యంలో హైడ్రా భయంతో ఓ రాజకీయ నేత తన ఫామ్‌హౌస్‌ను కూల్చేసుకున్నాడు. హైదరాబాద్ శివారు మెయినాబాద్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.