తెలంగాణ అసెంబ్లీలో నాలుగో రోజు సభ ప్రారంభం అయిన కొద్ది సేపటికే గందరగోళ పరిస్థితి నెలకొంది. రోడ్ల నిర్మాణంపై హారీశ్ రావు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య మాటల యుద్ధం మొదలైంది. హరీష్ రావు వ్యాఖ్యలపై స్పందిస్తూ.. మామ చాటు అల్లుడిగా హరీష్ రావు 10 వేల కోట్లు సంపాదించుకున్నాడని.. కాళేశ్వర్యంలో కమిషన్లు తీసుకున్నట్లు తాను నిరూపిస్తానని మంత్రి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా ఈ ఆరోపణలపై హరీష్ రావు ఘాటుగా స్పందించారు.