తిరుపతిలోని ఓ లా కాలేజీ హాస్టల్‌లో చోరీ జరిగింది. హాస్టల్‌లోని విద్యా్ర్థులు అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో.. ఇద్దరు ఆగంతకులు హాస్టల్‌లోకి ప్రవేశించారు. రాత్రి వేళ హాస్టల్‌లోకి దూరిన ఇద్దరు దొంగలు.. విద్యా్ర్థుల సెల్‌ఫోన్లను కాజేసి అక్కడి నుంచి ఉడాయించారు. ఉదయమే ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో చోరీ గురించి ఫిర్యాదు చేశారు. మొత్తం 19 సెల్‌ఫోన్లు మాయమైనట్లు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ గమనించిన పోలీసులు.. ఇద్దరు ఆగంతకులు హాస్టల్‌లోకి ప్రవేశించినట్లు గుర్తించారు. వారి కోసం గాలిస్తున్నారు.